ఏ రైతు సంతోషంగా లేడు. అప్పులతో
కుదేలైపోతున్నాడు. బాధ్యతలతో కుంగిపోతున్నాడు. అతనికున్న ఆస్తి,ఆశ ఒకటే వ్యవసాయ భూమే...!
మరోదారిలేక ఆత్మలేని శరీరమై – జీవచ్చవమై రైతులు జీవిస్తునారు. ఎవరికీ ఇలాంటి
పరిస్థితి రాకూడదు. చిన్న కమతాలు, నిధులు కొరత, ఆధునికమైన పద్ధతుల మీద అవగాహన
లేకపోవడం.
రైతు వ్యవసాయాన్ని వ్యవసయంగానే చూడడం,పంటను పంటగానే చూడడం,కష్టమే
అనుకోవడం. అసలు రైతు వ్యవసాయాన్ని వ్యాపారంగా,సరుకుగా,వ్యూహంగా,శాస్త్రీయతగా
అనుకోకుండా వచ్చినదనితో సరిపెట్టుకోవలసి వస్తుంది. కార్లు,బండ్లు,మద్యం,బేకరీ
వ్యాపారులకు లాభాలు వస్తాయి. కానీ రైతుకు మాత్రం పెట్టుబడి డబ్బు
తిరిగొచ్చినాగగనమే. కార్లు,బండ్లు,మద్యం,బేకరీ లేకపోయినా బతకొచ్చు.కానీ
తిండిగింజలు లేకపోతే బతకలేం. కూరగాయలు లేకపోతే బతకలేం....!
ప్రభుత్వాలకు నా విన్నపం
(కోరిక) ఏమిటంటే.....?
రైతులకు రుణ
మాఫీలు అవసరం లేదు...!
రైతులకు సేంద్రియ
ఎరువుల మిద అవగాన కల్పించండి...!
అవినీతి లేని పాలన
వ్యవస్థను,వ్యాపారాని ప్రసాదించండి....
సీజన్ వారి పంటలపై
అవగాన కల్పించండి...!
అంతకు మించి మేం ఏమి
అడగం.......!
0 comments:
Post a Comment