అవయవాల దానంతో పునర్జన్మ
అర్దాంతరంగా తనువు
చాలించినా కలకాలం చిరంజీవిగా జీవించే అవకాశం ఉంది!అదే అవయవాల దానం! మరణించిన
తర్వాత కాల్చడమో పుడ్చాడమో ద్వారా ఎవరికీ పనికిరాకుండా చేయడం కన్నా ప్రమాదవశాత్తు
అవయవాలు కోల్పోయిన వారికి ఉపయోగపడేలా
చూడడం మనందరి తక్షణ కర్తవ్యం కావాలి.
గుండె, కాలేయం, ఉపిరితిత్తులు, మూత్రపిండాలు, క్లోమం(ప్యాoక్రియాన్) పెద్ద చిన్నప్రేగు, ఎముకలు, ములుగా(బోన్ మ్యారో), కళ్లు అర్దాంతరంగా మరణిoచే వ్యక్తులు నుంచి సేకరించి అవసరమైనా వారికీ అమర్చే
అవకాశం ఇప్పుడుఉంది. చనిపోయేముందు చేసే ఈ మంచిపని వల్ల కలకాలం జీవించవచ్చు
సాటివారికి బ్రతికిచవచ్చు.
అవయవాల మార్పిడి అంటే ఏమిటి?
మనిషి శరీరం నుంచి
సేకరించిన అవయవాలను మరో మనిషి శరీరంలో అమర్చడమే అవయవాల మార్పిడి. వైద్య పరిభాషలో
దిన్ని “ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్” అంటారు.
అవయవాలను ఎవరు దానం చెయ్యవచ్చు?
మనసుండాలే కానీ ఆరోగ్యవంతమైన అన్ని వయసుల వారు అవయవాల
దానానికి అర్హులే. ప్రమాదం వల్ల కానీ నివారణ వల్ల కానీ వ్యాధి వల్ల కానీ
ఆకస్మికంగా బ్రెయీన్ డెడ్ స్టిత్తికి చేరుకున్నవారి నుంచి అవయవాలు సేకరించడం
జరుగుతుంది.
అవయవాల దానం కోసం నేనేం చేయాలి ?
ముందుగా అవయవాల దానంపై అవగాహన కలిగించుకోవడం,
మన కుటుంబ సభ్యులకు దానిపై అవగాహన కలిగించడం తప్పనిసరి. ఏవైనా అపోహలుంటే సంబంధిత
వ్యక్తులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అవయవాల దానంపై అవగాహన వచ్చిన తర్వాత
డోనార్ కార్డు (దాత అనుమతి కార్డు) పూర్తిచేసి దగ్గరుంచుకోవాలి లేదా కుటుంభికులకు అందిచేయాలి.
డోనార్ కార్డు పూర్తి చేయకపోయినా పర్వాలేదు. కుటుంబ సభ్యులు అంగీకరించినా
సరిపోతుంది. (మీ సౌకర్యం కోసం డోనార్ కార్డు ఇక్కడ జతపరుస్తున్నాము. దిన్ని
పూర్తిచేసి మీ పర్సులో జాగ్రత్తగా ఉంచుకోవాలి)
“బ్రెయిన్ డెడ్” స్థీతి అంటే ఏమిటి ?
ప్రమాదం వల్లకాని, నివారణ కానీ వ్యాధివల్ల గాని ఒక వ్యక్తి కోమా స్థితిలోకి
చేరుకొని కేవలం వైద్యపరికరాల సాయంతో సరఫరా అయ్యే ఆక్సిజన్ కారణంగా మాత్రమే గుండె
పనిచేస్తూ రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ మళ్ళి స్ప్రహలోకి రాలేని పరిస్థిని “బ్రెయిన్
డెడ్” (మెదడు మరణం) స్థితి అంటారు. బ్రెయిన్
డెడ్ స్థితిలోని వ్యక్తుల మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలు అందవు. ఇలాంటి స్థితికి చేరుకున్న వారికి వైద్యపరికరాలు అందించే ఆక్సిజన్
నిలిపి వేస్తే క్రమక్రమంగా గుండె, ఊపిరితిత్తులు ఇలా అన్ని అవయవాలు ఒకదాని తర్వాత
మరొకటి పనిచేయడం మానేస్తాయి. బ్రెయిన్ డెడ్ స్థితి రాగానే వైద్యులు గుర్తించి
ఆక్సిజన్ ఎక్కువ వత్తిడితో శరీరంలోకి పంపుతూ ఉంటారు. అలా ఆ వ్యక్తి మరణించినా
అవయవాలు పనిచేస్తున్న స్థితిలో ఉంచటం వల్ల వాటిని వేరు చేసి ఇతరులకు అమర్చే అవకాశం
ఉంది.
ప్రమాదం గురైన వ్యక్తి ఏ మాత్రం
కోలుకునే అవకాశం కలిగి ఉన్నా సరే వైద్యులు అతనిని బ్రతికించేoదుకు ప్రయత్నిస్తారు.
అన్ని ప్రయత్నాలు విఫలం అయిన తరువాత బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తారు. మరింతగా
అనుమానం లేకుండా వ్యవహరించేందుకు ఆ వ్యక్తికి జరిగిన చికిత్సతో సంబంధం లేని,
ప్రభుత్వ సిఫార్సు చేసిన సీనియర్ డాక్టర్ల బృందం మళ్లి అన్ని రకాల పరీక్షలు జరిపి
“బ్రెయిన్ డెడ్”గా నిర్దారిస్తుంది.
అందువల్ల ఆ వ్యక్తి మరణం పట్ల ఎవరూ అనుమాన పడాల్సిన అవసరం లేదు.
డోనార్ కార్డు పై సంతకం చేసిన తర్వాత నిర్ణయం
మార్చుకుంటే ?
ఏమీ కాదు. సంతకం చేసిన తర్వాత కూడా మీ
నిర్ణయం మరీతే నిరభ్యంతరంగా కార్డ్ ను చించి పారేయవచ్చు. అవయవాల దానం ఒకరి
వత్తిడితో జరిగేది కాదు. మీ అంతట మీరు స్వచ్చందంగా చేయాల్సిన పని. కాబట్టి ఎలాంటి
అపోహలు వద్దు.
కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తే ?
ఏ పరిస్థితుల్లో మీరు అవయవాల దానానికి
అంగికరించారో వారికి వివరించండి. దాని ప్రాధాన్యత గురించి కూడా వివరించండి. వారికీ
కూడా అవయవాల దానానికి ప్రోత్సహించండి. కుటుంబసభ్యుల అనుమతి లేనిదే అవయవాల దానం
స్వీకరించడం సాద్యం కాదు.
అవయవాల దానం తర్వాత మృతదేహం సక్రమంగా ఉంటుoదా లేక
ఛిద్రం (డిస్ ఫిగర్మెంట్) అవుతుందా?
చిద్రం కాదు. అవయవాలను
తొలగించిన తర్వాత మృతదేహం భాహ్య స్వరూపంలో ఎటువంటి మార్పు ఉండదు. మృతదేహం మాములుగా
ఎలా ఉంటుందో అదేవిదంగా ఉంటుంది. కాబట్టి ఖనననికి గాని,దహనానికి మతపరమైన అభ్యంతరాలు
ఉండవు.అవయవాలు దానానికి మీ అందరి సహకారం అవసరం.మన దేశంలో ఏట సుమారు లక్షా మంది
మూత్రపిండాలు (కిడ్నీలు)పాడైపోవడం ద్వారా ,మరి అంతే మంది కాలేయం (లివర్) పాడైపోవడం ద్వారా అవయవాల మార్పిడి కోసం ఎదురు చుస్తున్నారు. అయీతే
కేవలం 2,500 మందికి మాత్రమే కిడ్ని మార్పిడి ఆపరేషన్లు, పదుల సంఖ్యలో మాత్రమే కాలేయo
మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. అవయవాలు సకాలంలో అందుబాటులోకి వస్తే మరింత
మందికి మనం ప్రాణదానం చేయవచ్చు. అవయవాలా దానంపై మీకు ఇంకా సందేహాలు ఉంటే మా
వలంటిర్లు సహకరించడానికి సిద్దంగా ఉంటారు.
అవయవాల దానాన్ని ప్రోత్సహించండి
అవయవాల దానాన్ని ప్రోత్సహించండి
మన జీవితాన్ని సార్ధకం
చేసుకుందాం రండి!
లేదా
On-line Registration కొరకు image Click చేయండి
సంప్రదించవలసిన చిరునామా :
క్రియేటర్స్ స్వచ్చంద సంస్థ
#
8-47/1, Main Road, Peddavangara, Kodakandla,
Warangal,
Telangana State – 506 317. Cell: +91 9533107818
www.creatorsvoluntaryorganization.org
ఫౌండేషన్ చిరునామా :
జీవందన్ స్కీమ్ తెలంగాణ
NIMS,
Hyderabad – PH: 040 – 23489494.
0 comments:
Post a Comment